Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 January 2025, 1:42 pm Posted by : ramakrishna

 మజ్లీస్  పార్టి బోధన్ టౌన్ కమిటి రద్దు

. . .ఎంఐఏం  జిల్లా అధ్యక్షుడు  ఫయాజుద్దీన్

 

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:

 

ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాద్ ముస్లిమీన్ అధ్యక్షుడు, హైదరాబాద్  ఎంపి అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు బోధన్ ఎంఐఎం టౌన్  కమిటిని రద్దు చేశారు. నిజామాబాద్‌  జిల్లా పార్టి కార్యాలయంలో బుదవారం ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఎంఐఎం ముహమ్మద్‌ ఫయాజుద్దీన్‌,  నిజామాబాద్ నగర అధ్యక్షుడు ముహమ్మద్‌ షకీల్‌ అహ్మద్‌ ఫాజిల్‌, ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ షాబాజ్‌ అహ్మద్‌తో కలిసి ప్రకటించారు. బోధన్ టౌన్ ఎంఐఎం రద్దు చేయాలని మజ్లిస్ అధ్యక్షుడు బారిస్టర్ ఒవైసీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఒవైసీ సలహా మేరకు ,మజ్లిస్ జిల్లా సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాలిక్ పీట్ అసెంబ్లీ సభ్యుడు శ అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా సలహాతో, మజ్లిస్ ఆదిలాబాద్ అధ్యక్షుడు, బైంసా మున్సిపల్ చైర్మన్  జాబర్ అహ్మద్ లతో చర్చించి  బోధన్ ఎంఐఎం పట్టణ  నూతన కమిటి ఎర్పాటు చేస్తామని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు బోధన్‌లో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు ప్రజల్లో ఉంటూ పార్టీని బలోపేతం చేయాలని వారు సూచించారు.