Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 July 2025, 8:31 pm Posted by : ramakrishna

చైల్డ్ వెల్ఫేర్ అధికారుల ఆదేశాలు బేఖాతార్

  • హోటల్ యజమానులకు కౌన్సిలింగ్ ఇచ్చిన తీరు మార్చుకోని వైనం
  • తిరిగి మళ్ళీ బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యజమానులు

Disregarding the orders of child welfare officials

రుద్రూర్, బతుకమ్మ : చైల్డ్ వెల్ఫేర్ అధికారులు అంటే పిల్లల సంరక్షణ, సంక్షేమానికి సంబంధించిన పనులను చూసే అధికారులు. వీరు పిల్లల హక్కులను కాపాడటం, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడం, పిల్లల ఎదుగుదలకు అవసరమైన సహాయాన్ని అందించడం వంటి పనులు చేస్తారు. తెలంగాణలో, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వీరికి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తుంది. రుద్రూర్ మండలం కేంద్రంలోని పండరి పూర్ హోటల్ లో ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం అధికారులు తనిఖీలు నిర్వహించి, హోటల్లో పనిచేస్తున్న బాల కార్మికునికి, హోటల్ యజమానికి కౌన్సిలింగ్ నిర్వహించారు. కానీ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఆదేశాలను హోటల్ యాజమానులు బేఖాతారు చేస్తూ, బాల కార్మికులను పనిలో పెట్టుకోవడం చట్టను హత్య నేరమని తెలిసినా కూడా  తిరిగి మళ్ళి బాల కార్మికులను పనిలో పెట్టుకున్నారు. ఈ విషయంపై చైల్డ్ వెల్ఫేర్ అధికారులు వెంటనే స్పందించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Disregarding the orders of child welfare officials