Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 9:27 pm Posted by : ramakrishna

నిధుల లొల్లి

 

. .  . ఇందూర్ జిల్లాలో అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్ష పార్టీలు

 

. . . అధికార పార్టీని టార్గెట్ చేసిన ప్రతిపక్ష పార్టీలు

 

. . . బల్ధియాలో నిరసనల వెల్లువ

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అధికార పార్టీ వర్సెస్ బీజేపీ పార్టీ అన్న చందంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 9 నియోజకవర్గాల్లో మూడు నియోజకవర్గాల్లో బీజేపీ ప్రభావం ప్రత్యర్థిగా ఉంది. ఒక ఎంపీతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు మద్దతు తెలుపడంతో ఉమ్మడి జిల్లా రాజకీయం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట నిరసనలు తీవ్రతరం అవుతున్నాయి.

 

Dispute over funds

 

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలో జరిగిన అవినీతి, అక్రమాలపై భారత రాష్ట్ర సమితి నిరసన తెలిపిన విషయం తెల్సిందే. ప్రధానంగా నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గాల్లో నిరసనలు జరిగాయి. ఆయా నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలతో నిరసనలు అట్టుడుకుతున్నాయి. నిజామాబాద్ అర్బన్ తో పాటు ఆర్మూర్, కామారెడ్డి నియోజకవర్గాలను టార్గెట్ చేశారు. ప్రధానంగా ప్రతిపక్ష పాత్ర పోశించాల్సిన బీఆర్ఎస్ అణిగిమనిగి ఉండగా బీజేపీని బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. అందులో భాగంగా ఇటీవల వరుసగా నిజామాబాద్, ఆర్మూర్, కామారెడ్డి నియోజకవర్గాలను టార్గెట్ చేసింది. దానిలో భాగంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలు స్థానిక లోకల్ ఎమ్మెల్యేల విషయంలో కలవరపాటుకు గురి చేస్తుంది. ఇప్పటికే రెండు సంవత్సరాల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిధులివ్వడంలో మోకాలడ్డుతూనే ప్రతి పక్ష పార్టీ ఎమ్మెల్యేలను కార్నర్ చేసింది. ఇందులో భాగంగానే నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, కామారెడ్డి నియోజకవర్గాలను టార్గెట్ చేస్తూ నిరసన కార్యక్రమాలను చేపట్టింది. ప్రధానంగా సోషల్ మీడియాను టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యే లను ముప్పు తిప్పలు పెట్టె పనిలో పడింది. అందులో భాగంగా నియోజక వర్గాల అభివృద్ధి జరగడం లేదని పోస్టులను సోషల్ మీడియాతో పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపులిచ్చినట్టైంది. నిజామాబాద్ అర్బన్ వ్యవహారంలో ఇప్పటికే అధికార పార్టీ ఎమ్మెల్యే ను టార్గెట్ చేస్తూ నిధుల విడుదలకు మోకాలడ్డింది. ఆ సమయంలోనే ప్రతి పక్ష బీఆర్ఎస్ నిరసనలను చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది. అందులో భాగంగానే ఆదివారం ఛలో ఆర్మూర్ కు పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 

Dispute over funds