ద్రాక్షరామ భీమేశ్వర స్వామి ఆలయంలో అపశ్రుతి
ద్రాక్షరామం, బతుకమ్మ: ఏపీలోని కోనసీమ జిల్లా ద్రాక్షరామ భీమేశ్వర స్వామి ఆలయంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆలయంలో కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో మిషన్ తో గడ్డిని కోస్తుండగా విద్యుత్ షాక్ తగిలి కాంట్రాక్ట్ కూలీ భీమన్న మరణించాడు. మృతదేహాన్ని రామచంద్రపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆలయ దర్శనాలు నిలిపివేసి సంప్రోక్షణ చేసిన అనంతరం యథావిధిగా దర్శనాలు కల్పించినట్లు ఈవో వెంకట దుర్గాభవాని తెలిపారు.