కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా ఇస్రోజివాడకు చెందిన తల్లీకూతుళ్ళు కనిపించకుండాపోయారు. కందుకూరి దశరథ్ అనే వ్యక్తి ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో తన భార్య రేణుక, కూతురు అశ్వితలు ఇంట్లో గొడవపడి బయటకు వెళ్లి కనిపించకుండాపోయారని ఫిర్యాదు చేశారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గుండెల రాజు తెలిపారు.