వికలాంగ విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ కోసం మరింత  శిక్షణ ఇవ్వాలి

పండిత్ దీన్ దయాళ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న జడ్జీ పద్మావతి బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : వికలాంగ విద్యార్థులు వాళ్లు ఏ రంగాల్లో రాణిస్తున్నారో గమనించి ఆ రంగాల్లో ప్రతిభ చాటే విధంగా శిక్షణను అందిస్తే తమ వికలాంగాన్ని సైతం జయిస్తారని జిల్లా సివిల్ జడ్జ్ పద్మావతి పేర్కొన్నారు. బుధవారం పండిత్ దీన్ దయాళ్ జయంతి సందర్భంగా స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి సీనియర్ సివిల్ జడ్జీ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పద్మావతి హాజరయ్యారు....