Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 6:39 pm Posted by : ramakrishna

విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించిన డైరెక్టర్ ఆపరేషన్స్ మధుసూదన్

 

నిజామాబాద్ , బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లాలోని డిచ్‌పల్లి, సిరికొండ, భీమ్‌గల్, పోచంపాడ్ సబ్‌స్టేషన్లను  తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్  డైరెక్టర్ ఆపరేషన్స్ మధుసూదన్, బాబు రావుతో కలిసి సందర్శించి విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు. ఈ పర్యటనలో భాగంగా 220/132/33 KV సబ్‌స్టేషన్, డిచ్‌పల్లి; 132/33 కె.వి సబ్‌స్టేషన్, సిరికొండ; 220 కె.వి సబ్‌స్టేషన్, భీమ్‌గల్; 132/33 KV సబ్‌స్టేషన్, పోచంపాడ్‌లను సందర్శించి, ఆయా సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరా పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ 33 కె.వి. ఫీడర్లపై విద్యుత్ లోడ్లు, 132/33 కె.వి. సబ్‌స్టేషన్లలో పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల లోడింగ్ పరిస్థితులను సమీక్షించారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా వ్యవస్థ పనితీరును పరిశీలించి, గ్రిడ్ స్థిరత్వాన్ని కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.  విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా, పవర్ ట్రాన్స్‌ఫార్మర్లపై అధిక భారం పడకుండా నిరంతరం లోడ్ పరిస్థితులను పర్యవేక్షించాలని సూచించారు. విద్యుత్ వ్యవస్థలో సమస్యలను ముందుగానే గుర్తించి, అవసరమైన చర్యలు చేపట్టడం ద్వారా వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.విద్యుత్ సరఫరా వ్యవస్థ స్థిరత్వం, పవర్ ట్రాన్స్‌ ఫార్మర్ల సురక్షిత నిర్వహణ, ,వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా ఈ పర్యటన నిర్వహించినట్లు తెలిపారు.ఈ పర్యటనలో బాబు రావు, ఎస్ ఈ ట్రాన్స్ కో ఆరోగ్య రాజు, డిఈ డిచ్‌పల్లి హరిచంద్, డిఈ ఆర్మూర్ రఘు, ఏడిఈ ఆపరేషన్, డిచ్‌పల్లి శ్రీనివాస్, ఏడిఈ ఆపరేషన్, పెర్కిట్ శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Director (Operations) Madhusudan reviewed the power supply situation