హైదరాబాద్, బతుకమ్మ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి, అదనపు కమిషనర్ ఖురేష్, నిజామాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాన్ని అభినందించారు. నిషేధిత గంజా మాదకద్రవ్యాలను గుర్తించి పట్టుబడిన కేసులో, మొత్తం 30 కిలోల డ్రై గంజా, ఒక కారు, రెండు మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకొని, ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసిన సందర్భంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ నిజామాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందానికి రూ.15,000 నగదు బహుమతిని అందజేసి, భవిష్యత్‌లో మరిన్ని కేసులను గుర్తించేందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ స్వప్నా, ఎస్ఐ రామకుమార్, సిబ్బంది హమీద్, అవినాష్, విష్ణు, సుకన్య, శ్యామ్ సుందర్, సాయి కుమార్ లు నగదు బహుమతిని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ వి.సోమిరెడ్డి, ఎస్‌టిఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ ప్రణవని, ఎక్స్ సైజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ రావు పాల్గొన్నారు.