ఎన్‌ఫోర్స్ మెంట్ సీఐని అభినందించిన డైరెక్టర్ కమలాసన్ రెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి, అదనపు కమిషనర్ ఖురేష్ నిజామాబాద్ ఎన్‌ఫోర్స్ మెంట్ సీఐ స్వప్నను అభినందించారు. నిషేధిత గంజా మాదకద్రవ్యాలను గుర్తించి పట్టుబడిన కేసులో, మొత్తం 30 కిలోల డ్రై గంజా, ఒక కారు, రెండు మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకొని, ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసిన సందర్భంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టర్ నిజామాబాద్ ఎన్‌ఫోర్స్ మెంట్ బృందానికి రూ.15,000 నగదు బహుమతిని అందజేసి, భవిష్యత్‌లో మరిన్ని కేసులను గుర్తించేందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో...