Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 July 2025, 6:34 pm Posted by : ramakrishna

ఉర పండుగ సందర్భంగా బోధన్ కు డైరెక్ట్ రూట్ లో  వాహనాల మల్లింపు

 

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

నిజామాబాద్ నగరంలో ఉర పండగను పురస్కరించుకుని బోధన్ రూట్ లో వెళ్లే వాహనాలను డైరెక్ట్ రూట్ లో వెళ్లేలా డైవర్షన్ చేస్తున్నట్లు నిజామాబాద్ ట్రాఫిక్ ఎసిపీ మస్తాన్ అలీ తెలిపారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బోధన్ వైపు వేళ్లు, బోధన్ నుంచి వచ్చే వాహనాలు బోధన్ బస్ స్టాండ్, నెహ్రూ పార్క్, గాంధీ చౌక్, మీదుగా బస్టాండ్ వైపు వెళ్లాలని ఏసీపీ తెలిపారు. ఉర పండుగ సందర్భంగా ఖిల్లా చౌరస్తా నుంచి దేవతా విగ్రహాల ఊరేగింపు గమ్యస్థానాలకు  వివేకానంద విగ్రహం, గాజుల్ పేట్, గురుద్వారా, పెద్ద బజార్ చౌరస్తా, , గోల్ హనుమాన్ మీదుగా వినాయక్ నగర్, దుబ్బ వైపు వెళ్లుతాయని ఏసీపీ తెలిపారు. కాబట్టి నగర ప్రజలు ట్రాఫిక్ డైవర్షన్  గమనించి ప్రయాణించాలని కోరారు.

Direct route to Bodhan for Ura festival