డైరెక్టు కొనుగోలు కేంద్రాన్ని రైతులు వినియోగించుకోవాలి

ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : నగరంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో డైరెక్టు కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి తెలిపారు. ఈమేరకు  ప్రస్తుత సీజన్ లో రైతులు నేరుగా పంటను అమ్ముకునేందుకు అవకాశం కల్పిస్తూ.. బుధవారం ఈకేంద్రాన్ని ప్రారంభించమన్నారు. రైతులు తమపంటను ఎండబెట్టి, చెత్తాచెదారం లేకుండా మార్కెట్ కు తీసుకురావాలని కోరారు. దళారులకు ఎలాంటి కమిషన్ లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయని పేర్కొన్నారు.