- భూపతి రెడ్డి గురించి మాట్లాడే స్థాయి దినేష్ కు లేదు.
- భూపతి రెడ్డి ఎమ్మెల్సీ పదవిని సైతం త్రునప్రాయంగా వదిలి పెట్టారు
- రూరల్ అభివృద్ది కి 300 కోట్ల నిధులు
- మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ : రాజకీయ గురువులు మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ లను మోసం చేసిన వ్యక్తి దినేష్ కులచారి అని పిసిసి డేలిగేట్ శేఖర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి అన్నారు. రూరల్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం పిసిసి డేలిగేట్ శేఖర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డిచ్ పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అమృత్ పూర్ గంగాధర్ లు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిసిసి డేలిగేట్ శేఖర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ.. మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నో అవకతవకలు చేసిన దినేష్ ను రెండేళ్ల తరువాత రెన్యువల్ చేయకుండా బాజిరెడ్డి ఆపివేశారని గుర్తు చేశారు. రాజకీయ ఓనమాలు నేర్పిన మాండవ వెంకటేశ్వరరావును, ఏఎంసీ పదవి కట్టబెట్టిన బాజిరెడ్డి గోవర్ధన్ లను మోసం చేశారని అన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాత్రం 20 ఏళ్లు ఉద్యమంలో పనిచేశారని అన్నారు. ఎమ్మెల్సీ పదవిని సైతం త్రునప్రాయంగా వదలిపెట్టిన గొప్ప నాయకులు భూపతి రెడ్డి అన్నారు. ఉద్యమంలో ఆస్తులు అమ్ముకుని సేవ చేశారని అలాంటి గొప్ప ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటని అన్నారు. మాటలు సరిగా మాట్లాడడం నేర్చుకోవాలని హేచ్చరించారు. ప్రతి పక్షం లో ఉన్నపుడు విమర్శ చేయడం సహజమే కానీ దినేష్ భాష తీరు సరిగా లేదని అన్నారు. ఇటుక బట్టిలా ఎమ్మెల్యే అని మాట్లాడటం సరి కాదని, మా ఎమ్మెల్యే అవినీతి కి ఆమడ దూరంలో ఉంటారని, అభివృద్ది కి ముందు ఉంటారని అన్నారు. డాక్టర్ గా సంపాదించుకునే అవకాశం ఉన్న సమాజ సేవకోసం వృత్తిని పక్కకు పెట్టీ సమాజ సేవ కోసం ప్రజా క్షేత్రంలోకి వచ్చిన గొప్ప నేత భూపతి రెడ్డి అన్నారు. బీజేపీ నాయకులు మాత్రం సమాజంలో మత కల్లోలాలు సృష్టిచేలా చూస్తున్నారన్నారు. అన్ని కులాలు అన్ని మతాలను ఒకే లా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. బీజేపీ గెలిచిన పదేళ్లలో జిల్లాకు చేసింది ఎందని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బీజేపీ కి తగిన గుణపాఠం నేర్పాలని ప్రజలను కోరారు. డిచ్ పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అమృత పూర్ గంగాధర్ మాట్లాడుతూ.. గతంలో జడ్పీటీసీ గా గెలిచి సొంత గ్రామానికి ఎం చేసావని ప్రశ్నించారు. వయసుకు మించి మాట్లాడటం సమాజసం కాదని అన్నారు. అభివృద్ది ప్రధాన ఎజెండా గా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పనిచేస్తున్నారని, రూరల్ నియోజకవర్గంలో మునుపేన్నడు లేనివిధంగా ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి గ్రామ గ్రామానికి నిధులు కేటాయించడం జరిగిందన్నారు. దాదాపు రూ. 300 కోట్లతో రూరల్ నియోజక వర్గాలలో అన్ని గ్రామాల్లో శంఖు స్టొపనలు చేస్తూ గ్రామ గ్రామాన ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుంటే, ఎమ్మెల్యే పై తప్పుడు ఆరోపణలు చేస్తూ, విమర్శించడం తగదన్నారు. దినేష్ కులచారి ఖబర్దార్, నోటికి వచ్చిన మాటలు మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని గ్రామ గ్రామాన అడ్డుకుంటారని తరిమి కొడతారని హెచ్చరించారు. ఎంపీ పుణ్యమా అని జిల్లా అధ్యక్ష పదవి వచ్చిందని, ఎమ్మెల్యే అయినట్లు పగటి కలలు కంటూన్నవని, ఆ కలలు కళ్లలవుతాయని అన్నారు. రూరల్ ఎమ్మెల్యే నియోజకవర్గంలో జక్రాన్ పల్లి మండలంలోని నారాయణ పెట్ రోడ్ లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపడం జరిగిందని, ఆ పనుల నిమిత్తం జిల్లా కలెక్టర్ ను సైతం పరిశీలనకు పంపడం జరిగిందని గుర్తు చేసారు. మాజీమంత్రి బోధన్ ఎమ్మెల్యే తన నియోజకవర్గం లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపడం జరిగిందని, ఏ ఎమ్మెల్యే కైనా తన నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకోవాలని ఉంటుందని, అందులో భాగంగానే మా ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు పంపడం జరిగిందని, దానిని తప్పుగా అర్థం చేసుకోవడం సమంజసం కాదన్నారు. మీకు చేతనైతే కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఇది చేయాలి గాని విమర్శలు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి, డిచ్పల్లి మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి, ఇందల్వాయి మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, భోజన్న, సాం సన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రాజలింగం, ముల్లంగి గంగారెడ్డి, యువజన నాయకుడు ఏశాల మహేందర్, సంతోష్ రెడ్డి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.