Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 11:55 am Posted by : ramakrishna

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా దిల్షాదా రైహాన్

 

 

హైదరాబాద్‌,  బతుకమ్మ :

సెంట్రల్‌ యూనివర్సిటీ  ( యూఓహేచ్ )విద్యార్థి సంఘం ఎన్నికలు–2026 ఫలితాలను యూనివర్సిటీ ప్రకటించింది. అధ్యక్ష పదవికి (ఎఐఎస్ఏ, ఎఎస్ఏ, డిఎస్ యూ, ఎస్ ఎఫ్ఐ, టిఎస్ఎఫ్ )కూటమి తరఫున పోటీ చేసిన దిల్షాదా రైహాన్ 221 ఓట్లతో విజయం సాధించారు.ఉపాధ్యక్షుడిగా టి ఎస్ ఫ్ కు చెందిన కొర్ర నితిన్ చౌహాన్ 212 ఓట్లతో గెలుపొందారు. ఎఏస్ఎ కు చెందిన ప్రతీక్ 177 ఓట్లతో జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు.

అధ్యక్ష పదవికి పోటీ చేసిన ఎబివిపి– ఎస్ ఎల్ విడి కూటమి అభ్యర్థి నరేష్ పొదిశెట్టి 197 ఓట్లు సాధించారు. ఇతర ఫలితాల్లో జిస్తి – ఎస్ఇఎస్టి నుంచి పీహెచ్‌డీ బోర్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు హషిత ( ఎస్ ఎఫ్ ఐ) – స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ నుంచి పీహెచ్‌డీ బోర్డు సభ్యురాలిగా విజయం  గెలిచారు. బిజోయ్ – స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా స్కూల్ బోర్డు సభ్యుడిగా ఎన్నిక కాగా,సాహిల్ ( ఎబివిపి– ఎస్ ఎల్ విడి) – స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కౌన్సిలర్‌గా , జియాషెరిన్ (ఎబివిపి– ఎస్ ఎల్ విడి) –  ఐసిసి జిఎస్- క్యాష్ ఇంటిగ్రేటెడ్ సీటులో విజయం   సాధించగా, శ్రేయంత్ (ఎస్ ఎప్ఐ) – స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ నుంచి పీహెచ్‌డీ బోర్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు. శ్రీరామ్ (ఎస్ ఎప్ఐ) – సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ నుంచి పీజీ బోర్డు సభ్యుడిగా విజయం ఈ ఎన్నికల్లో సుమారు 5,900 మంది విద్యార్థులు ఓటు వేసేందుకు అర్హత కలిగి ఉండగా, 13 పాఠశాలల్లో 9 కేంద్ర పదవులు, 59 స్కూల్ బోర్డు కౌన్సిలర్ స్థానాలకు సుమారు 220 మంది అభ్యర్థులు పోటీ చేశారు.అధ్యక్ష పదవికి ఎఐఎస్ఏ, ఎఎస్ఏ, డిఎస్ యూ, ఎస్ ఎఫ్ఐ, టిఎస్ఎఫ్ కలిసి కూటమిగా ఏర్పడి దిల్షాదా రైహాన్‌ను అభ్యర్థిగా బరిలోకి దింపగా, పిడిఎస్ యూ –ఎంఎస్ఎఫ్, ఎన్ ఎస్ యూఐ,  ఫెటర్నిటి కూటమి తరఫున కే. నవీన్ కుమార్ పోటీ చేశారు.  ఎబివిపి– ఎస్ ఎల్ విడి కూటమి తరఫున నరేష్ పొదిశెట్టి అధ్యక్ష పదవికి పోటీ చేశారు.