శ్రీవారిని దర్శించుకొన్న దిల్ రాజ్ దంపతులు
భీమ్ గల్, బతుకమ్మ : తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజ్ సోమవారం లింబాద్రి గుట్ట నృసింహా స్వామిని దర్శించుకొన్నారు. వైశాఖ మాస శ్రీవారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ముందుగా లింబాద్రి గుట్ట గర్భలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలను నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం భీమ్ గల్ పట్టణం లోని గ్రామాలయంలో ఉత్సవాలు జరుగుతుండగా స్వామి వారిని దర్శించుకొన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ బోదిరే స్వామి, మండల నాయకులు జె జె...