భారత రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు కోసం డిజిటల్ వ్యవస్థకు శ్రీకారం

హైదరాబాద్, బతుకమ్మ :   కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, పునరుద్ధరణ కార్యక్రమాన్ని డిజిటల్ విధానంలో చేపట్టేందుకు కీలక చర్యలు ప్రారంభించింది. ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఇంచార్జీలను పార్టీ అధినేత ప్రకటించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సాంకేతికంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి నియోజకవర్గానికి ఒక ఐటీ నిపుణుడిని నియమించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వీరందరికీ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ లో ప్రత్యేక డిజిటల్ శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే ప్రకటించిన మేరకు సభ్యత్వ నమోదు కోసం...