జీ జీ హెచ్ లో డిజిటల్ రేడియోగ్రఫీ సేవలు ప్రారంభం
నిజామాబాద్ సిటీ బతుకమ్మ..
నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులో రేడియోలాజి సేవలు అందుబాటులోకి వచ్చాయి. అత్యాధున్నత రేడియోలాజి వ్యవస్థను రోటరి జిల్లా గవర్నర్ శరత్ చంద్ర ప్రారంభించారు. జిల్లా జనరల్ ఆసుపత్రిలో శుక్రవారం ప్రారంభ అనంతరం కార్యక్రమంలో రోటరీ గవర్నర్ మాట్లాడుతూ సమాజ సేవ చేయడమే రోటరీ క్లబ్ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. ఉత్తర తెలంగాణలోనే నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి ఎంతోమంది పేద రోగులు చికిత్స నిమిత్తం నిత్యం రావడం జరుగుతుందని అలాంటివారికి రోటరీ క్లబ్ ద్వారా వైద్య సేవలు అందడం సంతోషకరమన్నారు. లక్షల రూపాయలతో ప్రాజెక్టులను ఏర్పరచుకొని ఇలాంటి వ్యవస్థలను రూపొందిస్తే పేద రోగులకు వైద్య సేవలు అందించే ఆసుపత్రి డాక్టర్లు నర్సులు రోటరీ క్లబ్ యొక్క నిజమైన పార్ట్నర్స్ అని అన్నారు. గతంలో కూడా నిజామాబాద్ జి జి హెచ్ కు అనేకరకాలైనటువంటి పరికరాలను ఇతర సామాగ్రిని రోటరీ అందించిందని ఇక్కడే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూడా కేవలం ఆసుపత్రుల్లోనే కాకుండా పేద ప్రజలకు సాయం అందించే విధంగా రోటి క్లబ్ నిరంతరం కృషి చేస్తుందనిఆయన అన్నారు.
జిజిహెచ్ కు రోటరీ సేవలు అభినందనీయం….
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా కోవిడ్ సమయంలో కూడా రోటరీ క్లబ్ అందిస్తున్న సహకారం అభినందనీయమని ఆసుపత్రి సూపరింటేండేంట్ డా. ప్రతిమరాజ్ అన్నారు.ఇప్పటివరకు కొన్ని లక్షలు రూపాయలవిలువచేసే సామాగ్రినిజిజిహెచ్ కు అందించడం జరిగిందని, వారు అందించిన సామాగ్రి అలాగే ఇతర వైద్య పరికరాలతో జిజిహెచ్ కు వచ్చే ప్రతి పేద రోగికి వైద్య సేవలను అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలోరోటరీ క్లబ్ జిల్లా అధ్యక్షులు విజయరావు, జనరల్ సెక్రెటరీ గంగారెడ్డి,ట్రెజరర్ భరత్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
