నాళేశ్వర్ గ్రామంలో డిజిటల్ క్రాప్ సర్వే
నవీపేట్, బతుకమ్మ : నాళేశ్వర గ్రామం లో నిర్వహిస్తున్న డిజిటల్ క్రాప్ సర్వే (డీసీఎస్) కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఆర్మూర్ లావణ్య శ్రీనివాస్, బినోల సొసైటీ చైర్మన్ మగ్గారి హన్మండ్లు వ్యవసాయ విస్తరణ అధికారి దుంప విజయ్ తో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గ్రామం లోని సర్వే క్షేత్రాలను సందర్శించి, సర్వే ప్రక్రియను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక వాలంటీర్‌ను కేటాయించి సర్వే నిర్వహిస్తుంది. డిజిటల్ క్రాప్ సర్వేలో ప్రతి సబ్‌డివిజన్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించి,...