Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 1:12 pm Posted by : ramakrishna

నాళేశ్వర్ గ్రామంలో డిజిటల్ క్రాప్ సర్వే

 

నవీపేట్, బతుకమ్మ :

నాళేశ్వర గ్రామం లో నిర్వహిస్తున్న డిజిటల్ క్రాప్ సర్వే (డీసీఎస్) కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఆర్మూర్ లావణ్య శ్రీనివాస్, బినోల సొసైటీ చైర్మన్ మగ్గారి హన్మండ్లు వ్యవసాయ విస్తరణ అధికారి దుంప విజయ్ తో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా  గ్రామం లోని సర్వే క్షేత్రాలను సందర్శించి, సర్వే ప్రక్రియను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక వాలంటీర్‌ను కేటాయించి సర్వే నిర్వహిస్తుంది. డిజిటల్ క్రాప్ సర్వేలో ప్రతి సబ్‌డివిజన్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అందులో సాగు చేస్తున్న పంట, పంట రకం/వెరైటీ, సర్వే సమయంలో పంట దశ, విత్తిన తేదీ తదితర వివరాలను నమోదు చేస్తున్నారు. ఈ సందర్భంగా సర్వే వివరాలు ఖచ్చితంగా ఉండేలా క్షేత్రస్థాయిలో పంటలను ప్రత్యక్షంగా పరిశీలించి నమోదు చేయాలని వాలంటీర్లకు సూచించారు. అలాగే, డిజిటల్ క్రాప్ సర్వేను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. డీసీఎస్ త్వరగా పూర్తయితే  పంటల వారీగా సాగు విస్తీర్ణంపై స్పష్టత ఏర్పడి, సంబంధిత కొనుగోలు సంస్థలు పంటల సేకరణను సులభంగా ప్రణాళిక చేసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతులు భూమయ్య, గణేష్ వాలంటరీ నవీన్ ఉన్నారు.