ఆల్ ఫోర్స్ కళాశాలను తనిఖీ చేసిన డిఐఈవో

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : అడ్మిషన్ల సమయంలో మార్కుల ఆధారంగా వంద శాతం ఉచిత బోధన (ఫీజు లేకుండా) విద్యార్థులను ఫీజుల కోసం వేదిస్తున్నఆల్ ఫోర్స్ కళాశాలలో నిజామాబాద్ డిఐఈవో రవికుమార్ తనిఖీ నిర్వహించారు. ఈ నెల 10న బతుకమ్మ దినపత్రికలో ఆల్ ఫోర్స్ కళాశాలలో అరాచకం పేరిట వచ్చిన కథనంపై జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు స్పందించారు. సంబంధిత ఆల్ ఫోర్స్ కళాశాలలో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులను ఫీజుల పేరిట వేదించవద్దని వార్నింగ్ ఇచ్చారు. విద్యార్థులను ఎవరెవరు వేదిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు....