నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : అడ్మిషన్ల సమయంలో మార్కుల ఆధారంగా వంద శాతం ఉచిత బోధన (ఫీజు లేకుండా) విద్యార్థులను ఫీజుల కోసం వేదిస్తున్నఆల్ ఫోర్స్ కళాశాలలో నిజామాబాద్ డిఐఈవో రవికుమార్ తనిఖీ నిర్వహించారు. ఈ నెల 10న బతుకమ్మ దినపత్రికలో ఆల్ ఫోర్స్ కళాశాలలో అరాచకం పేరిట వచ్చిన కథనంపై జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు స్పందించారు. సంబంధిత ఆల్ ఫోర్స్ కళాశాలలో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులను ఫీజుల పేరిట వేదించవద్దని వార్నింగ్ ఇచ్చారు. విద్యార్థులను ఎవరెవరు వేదిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో అడ్మిషన్ల సమయంలో మార్కుల ఆధారంగా ఉచితంగా ఎంత మంది చేరారు, వారి తల్లిదండ్రుల నుంచి ఎంత మేర ఫీజులు వసూల్ చేశారని ఆరా తీశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రెండేళ్ళ క్రితం ఏర్పాటు చేసిన ఆల్ ఫోర్స్ జూనియర్ కళాశాలలో విద్యార్థులను ఫీజుల కోసం వేదిస్తున్న ఘటనలు కలకలం రేపిన విషయం తెల్సిందే.
