Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 February 2025, 1:17 pm Posted by : ramakrishna

కుంభమేళా నుంచి తిరిగి వస్తూ మృతి

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: కుంభ మేళా నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్న మహిళ గుండె పోటుతో రైలులో మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ లో గుర్తు తెలియని మహిళ గుండె పోటుతో మృతి చెందిందని నిజామాబాద్ స్టేషన్ మాస్టర్ హరికృష్ణ గురువారం రాత్రి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సాయిరెడ్డి సిబ్బంతో కలిసి మహిళ మృత దేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. మృతురాలి బ్యాగులో లభించిన ఆధార్ కార్డు, ఫోన్ ఆధారంగా ఆమెను కర్నాటక రాష్ట్రంలోని  బీదర్ జిల్లా బస్వాకళ్యాణ్ మండలం మిర్జాపూర్ కు చెందిన అనిత (59) గా గుర్తించారు. ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర  ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.