Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 March 2025, 2:36 pm Posted by : ramakrishna

చేపల వేటకు వెళ్లి మృతి

బోధన్, బతుకమ్మ: చేపల వేటకు వెళ్లి నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం(వై)గ్రామానికి చెందిన కొత్తోళ్ల ఒడ్డెన్న(56) అనే జాలరి మృతి చెందాడు. సోమవారం సాయంత్రం చేపల వేటకు వెళ్లిన ఒడ్డెన్న ప్రమాదవశాత్తు నీటిలోపడి మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.