నిజాంసాగర్ కాలువలో గల్లంతై మృతి

కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నా సాగర్ గ్రామానికి చెందిన  కర్రె విఠల్(40) అనే వ్యక్తి నిజాంసాగర్ ప్రధాన కాలువలో గల్లంతై మృతి చెందాడు. మిషన్ భగీరథ లో విధులు నిర్వర్తిస్తున్న విఠల్ ఆదివారం ఉదయం 11గంటలకు మహమ్మద్ నగర్ మండలం గున్కుల్ వెళ్లే దారిలో నిజాంసాగర్ ప్రధాన కాలువలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడిపోయాడు. సోమవారం ఉదయం 9గంటల సమయంలో బూర్గుల్ సమీపంలోని కాలువలో మృతదేహం లభించింది. మృతుడికి భార్య కర్రె సునీత, కూతురు హారిక...