Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 July 2025, 11:55 am Posted by : ramakrishna

బతుకుదెరువు కోసం వెళ్లి దుబాయిలో మృతి

ఇందల్వాయిలో అలుముకున్న విషాదఛాయలు

మృతదేహాన్ని స్వదేశానికి త్వరగా రప్పించాలని ప్రభుత్వానికి  కుటుంబ సభ్యుల వినతి

ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండలకేంద్రానికి చెందిన నీరడి భోజన్న (45) ఉపాధి కోసమని గల్ఫ్ దేశానికి బాట పట్టాడు. అతడిని మృత్యువు రెండు రోజుల క్రితం అనారోగ్యం రూపంలో కాటేసింది. దీంతో భోజన్న మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. మృతుడికి భార్య, పిల్లలు కలరు.తల్లి రోదిస్తూ మృతి చెందిన కొడుకు శవాన్ని త్వరగా ఇండియాకు రప్పించే విధంగా చొరవ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ని కోరారు. మృతుడు ఆర్థిక పరిస్థితుల వల్లనే దుబాయ్ బాట పట్టాల్సి వచ్చిందని రోదిస్తూ భార్య తెలిపింది. ప్రభుత్వం స్పందించి తమ కుటుంబానికి న్యాయం చేసే విధంగా సహకరించాలని కోరారు. ఇందల్వాయి మాజీ సర్పంచ్ వారి ఆర్థిక పరిస్థితులను చూసి రూ. ఐదువేలు విరాళంగా ఇచ్చారు.