మద్యంమత్తులో డ్రైనేజీలో పడి మృతి

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: నగరంలోని ఐదో టౌన్ పరిధిలో ఉన్న రాజ రాజేంద్ర చౌరస్తా వద్ద డ్రైనేజ్ లో పడి ఓ యువకుడు చనిపోయాడు. మహారాష్ర్టకు చెందిన కాంబ్లే కపిల్ గత కొన్నేళ్లుగా సీతారాంనగర్ కాలనీలో ఉంటున్నాడు. మంగళవారం రాత్రి మద్యం సేవించిన కపిల్ మత్తులో డ్రైనేజీలో పడి మృతి  చెందాడు.