Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 November 2025, 6:43 pm Posted by : ramakrishna

15 ఏళ్లు అధికారంలో ఉండి నిద్రపోయారా

  • కాంగ్రెస్ యువజన నాయకుడు సాయిని బస్వరాజ్

 

బతుకమ్మ, బిచ్కుంద : బిచ్కుంద మండల కేంద్రంలో సోమవారం రోజున రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలని బిచ్కుంద యువజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించడం జరిగింది. దీనిపై కాంగ్రెస్ యువజన నాయకుడు సాయిని బసవరాజ్ స్పందిస్తూ గత ఎమ్మెల్యే 15 ఏళ్లుగా అధికారంలో ఉండి తన అనుచరుల ద్వారా అడ్డగోలుగా మొరం, ఇసుక దందాలు నడపడం వల్లే రోడ్లపై గుంతలు పడ్డాయని ఈ పాపానికి కారకులు గత పాలకులే అంటూ ఆయన దుయ్యబట్టారు. గత మాజీ ఎమ్మెల్యే 15 సంవత్సరాల నుండి బిచ్కుంద లోనే ఉంటూ అదే రోడ్డుపై వస్తు, వెళుతూ రోడ్డుపై వస్తున్న దుమ్ము కారులోకి రానివ్వకుండా కనీసం కారు గ్లాస్ కూడా దించకుండా పాలించిన గత పాలకుడు మాజీ ఎమ్మెల్యే కు అప్పుడు రోడ్డు దుస్థితి కనబడలేదా? లేక అధికారంలోనే ఉన్నామన్న సోయి లేకుండేన? అంటూ ఆయన చురకలు అంటించారు. తన అనుచరులకు అప్పనంగా ఆస్తి రాసి ఇచ్చినట్టు సహజ వనరులన్నీ దోచుకోమని చెప్పి ఇవాళ నీతులు పలకడం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉందని అన్నారు. గత ఎమ్మెల్యే అనుచరుల సహజ వనరులదోపిడి విధ్వంసానికి ప్రతిరూపమే బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రధాన రహదారి అన్నారు. గత 15 ఏళ్ల కాలంలో మొరం ద్వారా, ఇసుక ద్వారా దోచుకోవాల్సినంత దోచుకుని ఏమీ ఎరుగని బిచ్కుంద లోని అమాయక యువకులను రెచ్చగొడుతూ తమ తప్పులను కప్పిపుచ్చుకుందామని చేస్తున్న ప్రయత్నంలో భాగమే సోమవారం నాటి ధర్నాకు ప్రతిరూపం అంటూ ఆయన విమర్శించారు. పాలనపై చిత్తశుద్ధితో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గెలిచిన అనాతికాలంలోనే బిచ్కుందను మున్సిపాలిటీగా చేయడమే కాకుండా సెంట్రల్ లైటింగ్ రోడ్డు పనులకు నిధులు కూడా మంజూరు చేయించడం జరిగింది. రాష్ట్రంలో కురుస్తున్న అతి భారీ వర్షాలు, అతివృష్టి వల్ల పనులు కాస్త ఆలస్యం అవ్వడంతో కాంగ్రెస్ పార్టీపై కడుపు మంటతో రగిలిపోతున్న గత ఎమ్మెల్యే అనుచరులు బిచ్కుంద లోని అమాయక యువకులను రెచ్చగొట్టి ధర్నాలు చేయించడం ఎంతవరకు సమంజసం? ఈ పాపానికి కారణం మీరే అన్న సంగతి మీరు మరిచిన ప్రజలు మరువలేదన్నారు. సెంట్రల్ లైటింగ్ రోడ్డు పేరిట, మున్సిపాలిటీ పేరిట అమాయక ప్రజలను గత ఎమ్మెల్యే మోసం చేసినప్పటికిని పాలన వ్యవస్థ పై చిత్తశుద్ధి కలిగిన తోట లక్ష్మీ కాంతారావు అనతి కాలంలోనే మున్సిపాలిటీ , సెంట్రల్ లైటింగ్ రోడ్డు పనులకు బిల్లులు మంజూరు చేయించడం హర్షించదగ్గ విషయమన్నారు. అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించినప్పటికీ వారి హక్కులను కాపాడే నైతిక ధర్మం కాంగ్రెస్ పార్టీకి ఉందని కానీ గత ఎమ్మెల్యే అక్రమ ఇసుక దందాకు అడ్డొచ్చిన వారందరి పైన అక్రమ కేసులు పెట్టి జైల్లోకి పంపించడమే కాకుండా లారీల కింద పడి చనిపోయిన వ్యక్తులకు గాని, 30 గొర్రెల పై నుంచి లారీ దూసుకెళ్తే కనీసం నష్టపరిహారం గాని, పరిహారం గాని లేకపోవడం అత్యంత దారుణమని అలాంటి పాలకులకు బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతోనే ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన కళ్ళకు పట్టిన అవినీతి, అహంకారపు పొరలు తొలగిపోలేదన్నారు. గతంలో బిజెపి నాయకులపై బిఆర్ఎస్ నాయకులు కర్రలతో వెంటపడి దాడి చేసిన ఘటనను ప్రజలు ఎవరు మర్చిపోలేదని గతంలో గుద్దులాడుకున్న నాయకులే ఈరోజు ముద్దులాడుకుంటున్నారని ఆయన ఎద్దేవ్య చేశారు. అమాయక యువకులను డబ్బులు ఇచ్చి రెచ్చగొడుతూ అనైతిక కార్యక్రమాలకు ఉసిగొలిపినట్లైతే నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఉండబోరని అమాయక యువకులు బలికావద్దని ఆయన హితవు పలికారు. రానున్న కాలంలో బిఆర్ఎస్ పార్టీకి మాటకు మాటే సమాధానంగా ఉంటుందని ఆయన ఘాటుగా హెచ్చరించారు.