Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 November 2025, 3:28 pm Posted by : ramakrishna

గుంతను పూడ్చరా..?

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలోని రోడ్డు మరమ్మతులు చేపట్టకపోవడంపై అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తుంది. రెండు నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు రోడ్డు గుంతలు పడడంతో సంబంధింత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. స్థానిక చౌరస్తా దగ్గర ఉన్న గుంత ప్రమాదకరంగా మారింది. వర్షాల వల్ల రోడ్లపై ఏర్పడిన గుంతలు వాహనాదారులకు ప్రమాదకరంగా మారాయి అధికారులు స్పందనలో ఆలస్యం అయినప్పుడు ప్రజలు స్వయంగా ముందుకు వచ్చి ప్రమాదాలను నివారించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నారు. కానీ సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గుంతలను పుడ్చాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Did you fill the hole?