మీ 10 ఏళ్ల పాలనలో ఏ ఒక్క రైతు కైనా న్యాయం చేశారా..?
పదేళ్లలో చేయని అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేస్తే విమర్శించడం సిగ్గుచేటు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి బతుకమ్మ నిజామాబాద్ సిటీ : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు దశలవారీగా ఏకకాలంలో రుణమాఫీ చేస్తుంటే ఓర్వలేక టిఆర్ఎస్ నేతలు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు తమపై విమర్శలు చేయడం వారి అవివేకానికి నిదర్శనమని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డితీవ్ర స్థాయిలో మండిపడ్డారు.శనివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా...