Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 July 2026, 11:11 am Posted by : ramakrishna

బాన్సువాడ ఎం సి హెచ్ సి లో సిజేరియన్ ఆపరేషన్ లు వికటించయా?

 

. . . ఐదుగురు గర్బిణిలకు తీవ్ర సమస్యలు

. . . నిజామాబాద్ జిజిహెచ్ కు రిపర్

 బాన్సువాడ, బతుకమ్మ:

బాన్సువాడ మాత శిశు సంరక్షణ కేంద్రం ( ఎం సి హెచ్ సి) లో సిజేరియన్ ఆపరేషన్ లు వికటించి ఐదుగురు గర్భిణిలకు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తాయి. వారిలో ఐదుగురిని నిజామాబాద్ జనరల్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. బాన్సువాడ  మాతా శిశు ఆసుపత్రిలో శుక్ర, శనివారాల్లో ప్రసూతి కోసం వచ్చిన 10 మంది మహిళలకు సిజేరియన్ నిర్వహించారు వైధ్యులు. అందులో ఐదుగురు బాలింతలకు తీవ్ర అనారోగ్య సమస్యలు ప్లేట్ లేట్ పడిపోవడం, యూరినరీ ఇన్ఫెక్షన్, కిడ్నీ నొప్పులు తలెత్తాయి. వెంటనే వారిని నిజామాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయ భాస్కర్ తెలిపారు. బాన్సువాడ ఎంసిహెచ్ సిలో జరిగిన సిజేరియన్ ల వలన ఐదుగురు మహిళల లో సమస్యలు తలెత్తడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఈ విషయంలో విచారణ జరుపుతున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయ భాస్కర్ తెలిపారు.

Did Caesarean operations go wrong at the Banswada MCHC?