నిజామాబాద్, బతుకమ్మ: ప్రయాణికుల సమస్యలను పరిష్కరించేందుకు మంగళవారం డయల్ ఆర్టీసీ ఆర్ఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు రీజినల్ మేనేజర్ టి.జ్యోత్స్న సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 4 నుంచి 5గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందని, ప్రయాణికులు ఆయా డిపోల మేనేజర్లకు ఫోన్ చేసి తమ సమస్యలను తెలపాలని సూచించారు. రీజినల్ మేనేజర్ – 9959226011, ఆర్మూర్ డిపో – 9959226019, బోధన్ డిపో – 9959226001, నిజామాబాద్ – 1 డిపో – 9959226016, నిజామాబాద్- 2 డిపో – 9959226017, కామారెడ్డి డిపో – 9959226018, బాన్సువాడ డిపో – 9959226020 నంబర్లకు ప్రయాణికులు ఫోన్ చేయాలని సూచించారు.