Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 12:07 pm Posted by : ramakrishna

‘డయల్ 112’ ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టింది

 

 కామారెడ్డి, బతుకమ్మ:

వ్యక్తిగత సమస్యలతో జీవితంపై విరక్తి చెంది రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు సిద్ధపడ్డ వ్యక్తి. ప్రాణం పోయే క్షణంలో ‘డయల్ 112’  కు వచ్చిన ఒక కాల్ ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టింది. మంగళవారం రాత్రి క్షణాల వ్యవధిలో  కామారెడ్డి పోలీసులు సమయస్ఫూర్తితో పునర్జన్మ పొందారు. ఫోన్‌లో నిరంతరం ధైర్యం చెబుతూనే, సాంకేతికతను ఉపయోగిస్తూ లోకేషన్ పసిగట్టి  దేవునిపల్లి -రామారెడ్డి పోలీసులు రైల్వే ట్రాక్ పై  వ్యక్తిని కాపాడేందుకు పోలీసులు చేసిన సాహసం నిజంగా ప్రశంసనీయమని కామారెడ్డి జిల్లా ఎస్పీ  రాజేష్ చంద్ర అన్నారు. జీవితం ఎంతో విలువైనది.. ఎలాంటి కష్టమొచ్చినా చావు పరిష్కారం కాదు. మీ ఆత్మీయులతో సమస్యను పంచుకోండి. ఆపదలో ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే 112 కు కాల్ చేయండి అని ఎస్పీ సూచించారు.