డయల్ 100 సేవలను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకోవాలి

ధర్పల్లి ఎస్సై జాడి రామకృష్ణ ధర్పల్లి, బతుకమ్మ: ప్రజలకు అత్యవసర సమయంలో సహయ పడేందుకు ఉద్ధేశించిన డయల్ 100 సేవలను దుర్వినియోగం చేసి శిక్షర్హులు కావద్ధని ధర్పల్లి ఎస్ఐ జాడి.రామకృష్ణ సుచించారు. మద్యంమత్తులో డయల్ 100కు పోన్ చేసి న్యూసెన్స్ చేసిన ధర్పల్లి పోలిస్ స్టేషన్ పరిధిలోని డిబి తాండాకు చెంది గుగ్లూతో గణేష్ కు న్యాయస్థానం రెండురోజుల జైలు శిక్ష విధించిందని తెలిపారు. డయల్ 100 ని ప్రజలు అత్యవసర సమయాలో వాడుకోవాలని ఎస్సై జాడి.రామకృష్ణ తెలిపారు.