జిల్లా సెషన్స్ కోర్టు పీపీగా ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా గురువారం ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాలోని ధర్పల్లిలో జన్మించిన రాజేశ్వర్ రెడ్డి ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం గ్రామంలోనే పూర్తి చేశారు. నిజామాబాద్ నగరంలో ఇంటర్, ప్రభుత్వ గిరిరాజ్ డిగ్రీ కళాశాలలో డిగ్రీపూర్తి చేసి మహారాష్ర్టలోని నాందెడ్ లా కళాశాల నుంచి 1986లో పట్టభద్రులయ్యారు. అదే సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్...