Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 7:21 pm Posted by : ramakrishna

5వ సారి గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా ధర్పల్లి ప్రభాకర్

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండలంలోని తీర్మాన్ పల్లి గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా ఐదవ సారి పదవి బాధ్యతలను స్వీకరించడం గమనార్హం.. గతంలో గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా నాలుగు పర్యాయాలు పదవిలో కొనసాగిన ప్రభాకర్ గ్రామ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా పూర్తి చేయడంతో మళ్లీ ఐదవ సారి గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా నియమించడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. అయినప్పటికీ సర్పంచ్ గా పోటీ చేసి స్వల్ప అధిక్యం తో ఓటమి పాలు అయినా ప్రభాకర్ ను గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో గ్రామంలో ఆనందం చోటుచేసుకుంది. గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే నాయకుడిని మళ్లీ గ్రామ అభివృద్ధికి చైర్మన్ గా నియమించుకోవడం గ్రామస్తుల అదృష్టంగా భావిస్తామని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేశారు. వైస్ చైర్మన్ గా జరుగు రాజు నియామకం కావడంతో, సభ్యులుగా ఇమ్మడి సాయిలు, కుమ్మరి భాస్కర్, చెన్న తిరుపతి, శెట్టి గంగారం, గాండ్ల ప్రదీప్, కురుమ బయ్యన్న, బొడ్డు రాజన్న, తెడ్డు ఎర్ర అబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.