- ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అనూష హత్యను ధర్పల్లి పోలీసులు సూసైడ్ కేసుగా మార్చారని ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత ఆరోపించారు. ఐద్వా సంఘం ఆధ్వర్యంలో శనివారం స్థానిక ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి కి వెళ్లి అనూష కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనూష హత్యను ఆత్మహత్యగా పోలీసుల చిత్రీకరించడం సరికాదని అన్నారు. హత్యకు పాల్పడిన భర్త లక్ష్మీపూర్ వినోద్ కుమార్ నను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపాలని డిమాండ్ చేశారు. మహిళకు న్యాయం చేయాల్సింది పోయి పోలీసులు డెడ్ బాడీని వేల్పూర్ మండలం జానకంపేట గ్రామానికి తీసుకెళ్లకూడదని చేతిరాతతో రాసి లెటర్ ఇవ్వమని అలాగే ఎస్పీ ఆఫీసుకు తీసుకెళ్ళి వారి కుటుంబాన్ని బెదిరించి ఇబ్బందులు పెట్టడం దారుణమని అన్నారు. తక్షణమే పోలీసులు అనూషకు న్యాయం చేయాలని లేకపోతే ఐద్వా గా ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.