Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 January 2025, 7:54 pm Posted by : ramakrishna

ధర్పల్లి హెడ్ మాస్టర్ గణ జ్యోతి రాణి సస్పెన్షన్

నిజామాబాద్, బతుకమ్మ:

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి జిల్లా పరిషత్ గేజిటేడ్ హెడ్ మాస్టర్ గణ జ్యోతి రాణిని సస్పెన్షన్ చేస్తు విద్యాశాఖ ప్రాంతియ సంచాలకులు సత్యనారాయణ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు బుదవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ధర్పల్లి జిల్లా పరిషత్ హెడ్ మాస్టర్ గణ జ్యోతి రాణివేదింపులపై ఎడాదిన్నర కాలంగా పాఠశాలలో ఉపాధ్యాయులు మొదలుకోని స్కావేంజర్ వరకు జిల్లా విద్యాశాఖాధికారి, జిల్లా కలెక్టర్ నుంచి విద్యాశాఖ సంచాలకుల వరకు పిర్యాదులు చేశారు.

Dharpalli Head Master Gana Jyoti Rani Suspension

కాని వేదింపులు ఆగలేదు. గత ఎడాధి ఈ విషయంలో ఎమ్మెల్యేకు పిర్యాదు చేసిన గేజిటేడ్ హెడ్మాస్టర్ అసోసియేషన్ అడ్డుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. తరువాత కాలంలో ఓక కాంగ్రెస్ పార్టి ఎమ్మెల్సీ సైతం గణ జ్యోతి రాణిపై చర్యలకు అడ్డుకట్ట వేశారని తెలిసింది.

Dharpalli Head Master Gana Jyoti Rani Suspension

గత నెలలో మద్యహ్న బోజనం బియ్యం అమ్ముకున్నారని పిర్యాదులు రావడంతో జిల్లా విద్యాశాఖాధికారి విచారణకు అదేశించారు. ఎంఇఓ సేవ్ లా ద్వార విచారణ జరిపించగా పాఠశాలలో రికార్డులలో ఉండాల్సిన బియ్యం కంటే అధనంగా 7 క్వింటాళ్ల బియ్యం ఉండటంతో పాటుఇతర అవకతవకలు బహిర్గతం అయ్యాయి. ఈ నేపథ్యంలో విచారణ నివేధికను ఆర్ జేడికి పంపడంతో అయన ధర్పల్లి జిల్లా పరిషత్ హెడ్మాస్టర్ గణ జ్యోతి రాణిని సస్పెండ్ చేస్తు ఉత్తర్వులు జారీ చేశారు.