కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని ధర్నా

కోటగిరి, బతుకమ్మ: కొత్త రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని ప్రజలు బుధవారం పోతంగల్ మండల కేంద్రంలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్థుడు బజరంగ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడం లేదన్నారు. వెంటనే స్పందించి కొత్త కార్డులను జారీ చేయాలని కోరారు. అలాగే మార్పులు చేర్పులకు అవకాశం ఇవ్వాలన్నారు. అనంతరం ఎమ్మార్వో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కిరణ్ సెట్, సూదం అశోక్, తుకారం, శంకర్, బండారి రవి, కయ్య లాలయ్య, సెలగమ...