వైద్యాధికారిపై దాడికి నిరసనగా ధర్నా

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డిలోని కల్కినగర్లో నివాసం ఉంటున్న రామారెడ్డి ప్రభుత్వ వైద్యాధికారి డా.సురేష్ పై దాడికి నిరసనగా వైద్య సిబ్బంది గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దేవనిపల్లి పీహెచ్సీ డీఈఓ రాజు, జుక్కల్ ప్రభుత్వ హాస్పిటల్ జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న సుభాష్ వ్యక్తిగత కారణాలతో డాక్టర్ పై దాడి చేశారని తెలిపారు. వారిపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎంహెచ్ఓ విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.