ఆర్మూర్, బతుకమ్మ : ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి జాతీయ రహదారి కూడలిలో రైతులు ధర్నాకు దిగారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది. అలాగే ధాన్యానికి మొలకలు వస్తున్నాయి.