కలెక్టరేట్ ఎదుట మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ ఆధ్వర్యంలో ధర్నా

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బిఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తించిన తీరు, పోలీసుల ద్వారా చేయించిన భౌతిక దాడులను నిరసిస్తూ నిజామాబాద్ నూతన కలెక్టరేట్ వద్ద నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.  ఈ సందర్భంగా బిగాల మాట్లాడుతూ  ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారెంటీల అమలును కోరుతూ నల్ల టీషర్టులు ధరించి...