శబరిమలలో తెరుచుకున్న ధర్మశాస్తా సన్నిధానం
వెబ్ డెస్క్, బతుకమ్మ : మంగళవారం తెల్లవారుజామున శబరిమలై అయ్యప్ప ఆలయాన్ని శాస్త్రోక్తంగా వృశ్చిక మాస పూజలు , మండల పూజల కోసం ద్వారాలు తీశారు. కొత్త మేల్శాంతి బ్రహ్మశ్రీ అరీఖ్కర సుబ్రహ్మణ్యన్ శంకరన్ నంబూదిరి చేతుల మీదుగా , తంత్రి బ్రహ్మశ్రీ స్వామి కందరరు బ్రహ్మదత్తన్ మార్గదర్శకత్వంలో శబరిమల శ్రీ ధర్మశాస్తా సన్నిధానం తలుపులు తీసే కార్యక్రమం నిర్వహించారు..