Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 September 2024, 11:17 am Posted by : ramakrishna

ధర్మపురి శ్రీనివాస్ ప్రజల మనిషి

 డియస్ జయంతి సంధర్బంగా నివాళులు అర్పించిన ఎంపి అరవింద్ ధర్మపూరి

నిజామాబాద్ , బతుకమ్మ :

ధర్మపురి శ్రీనివాస్ ప్రజల మనిషి ప్రతి నిమిషం ప్రజలకోసం పరితపించేవారని నిజామాబాద్ ఎంపి అరవింద్ ధర్మపురి అన్నారు. మాజీ మంత్రి దివంగత నేత  ధర్మపురి శ్రీనివాస్ జన్మదినం సంధర్బంగా అయన ఘాట్ వద్ధ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ పూలమాలలు వేసి శ్రద్ధంజలి ఘటించారు. శుక్రవారం ఉదయం నగరంలోని బైపాస్ రోడ్డులో గల డిఎస్ సమాది వద్ధ అయన జయంతి వేడుకలను నిర్వహించారు.

Dharmapuri Srinivas is a man of the people

 

ఈ సంధర్బంగా ఎంపి అరవింద్ మాట్లాడుతు… డిఎస్ తనకు తండ్రి మాత్రమే కాదని నాకు రాజకీయ గురువు అని అన్నారు. ప్రజలకు అయన రాజకీయాలకతీతంగా సేవచేశారు అని గుర్తు చేశారు. జిల్లా కేంద్రంలో  డిఎస్ విగ్రహం ఏర్పాటు చేయాలి అని కోరారు.  డిఎస్ జయంతి సంధర్బంగా నివాళ్లు అర్పించిన వారిలో ధర్మపురి అరవింద్ తో పాటు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, వ్యాపారవేత్త కాపర్తి శ్రవణ్ కుమార్, మాజీ జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మి నర్సయ్య,  రాష్ర్ట కార్యవర్గ సభ్యులు డాక్టర్ మల్లిఖార్జున్ రెడ్డి, ప్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, కోట పాటి నర్సింహనాయుడు, శంకర్, బంటు రాము తదితరులు ఉన్నారు.

 

Dharmapuri Srinivas is a man of the people