ధర్మపురి సంజయ్ ను సన్మానించిన బోధన్ మున్నూరు కాపులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా సోమవారం మున్నూరు కాపు కులస్తులు శాలువా పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బోధన్ మున్నూరు కాపు కులస్తులు తోట శ్రీనివాస్, మసూల్ శ్రీనివాస్, అల్లాడి దేవా, జానకంపేట మాజీ ఎంపీటీసీ సంజీవ్, రవి, ప్రవీణ్ కుమార్, చెర్రీ, కృష్ణ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.