Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 May 2026, 9:50 pm Posted by : ramakrishna

రేస్ లోకి ధర్మపురి

 

. . . కేంద్రమంత్రి పదవా . . . రాష్ట్ర అధ్యక్ష పదవా

 

. . . జోడు పదవులపై జోరుగా ప్రచారం

 

. . . సోషల్ మీడియాలో అడ్వాన్స్ గా శుభాకాంక్షల పోస్టుల వైరల్

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

మూడవ సారి ప్రధానిగా భాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోడి తెలంగాణ పర్యటన విజయవంతం నేపథ్యంలో బిజేపిలో మార్పుల చేర్పుల ఊహగానాలు జోరందుకున్నాయి. అవి కేంద్రమంత్రి వర్గ విస్థరణను మొదలు పెట్టి పార్టీ చీఫ్ మార్పుల వరకు సాగడమే అందుకు కారణం. దక్షిణాన ప్రస్తుతం తెలంగాణపై ఫోకస్ చేసిన బిజేపి అధిష్టానం వచ్చే అసెంబ్లి ఎన్నికలలో ఎలాగైన పాగా వేసేందుకు కసరత్తు మొదలేట్టింది. ఇప్పటికే బిజేపికి నూతన అధ్యక్షుడు నితిన్ నబిన్ నాయకత్వంలో 2029 శాసన సభ ఎన్నికలే టార్గెట్ గా ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కొందరికి కేంద్రమంత్రి వర్గ విస్థరణలో అవకాశం ఉంటుందని, రాష్ట్ర అధ్యక్ష పదవి కొత్తవారికి ఇస్తారని ప్రచారం జోరందుకుంది. తెలంగాణలో ఇటీవల కేంద్రమంత్రి బండి సంజయ్ తనయుడి ఉదంతం తో కొత్తవారికి మంత్రి పదవుల పంపిణీ జరుగుతుందని, రాష్ట్ర పార్టీ రథసారధిని యువ నాయకత్వానికి అప్పగిస్తారని టాక్ నడుస్తుంది. దానితో రాష్ట్రానికి కొత్తగా కేంద్రమంత్రి పదవి ఇచ్చిన లేదా రాష్ట్ర బిజేపి చీఫ్ పదవి ఇచ్చిన దానిలో ముందువరుసలో తాను ఉన్నానని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి చెప్పకనే చెబుతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం నుంచి అర్వింద్ కేంద్రమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల రెండోసారి ఎంపీ గా గెలిచిన తరువాత జరిగిన బిజేపి అధ్యక్ష పదవి రేసులో నిలిచిన ఆర్ఎస్ఎస్ మూలాలతో రాంచందర్ రావు అ పదవిని ఎగురేసుకుపోయిన విషయం తెలిసిందే.

ఉత్తర తెలంగాణలో బిజేపికి బిసీ సామాజిక వర్గం నుంచి బండి సంజయ్ తరువాత బలమైన నాయకుడిగా అర్వింద్ ముందు వరుసలో ఉన్నారు. రెండు సార్లు ఎంపీ గా గెలువడమే కాకుండా పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపించుకోవడంలో, స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీకి దీటుగా స్థానాలను గెలిచి బలమైన ప్రతిపక్షంగా బిజేపిని నిలుపడంలో ఎంపీ అర్వింద్ పాత్ర ఎనలేనిది. ఉత్తర తెలంగాణలో ప్రధానంగా పసుపు రైతుల కోరిక జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్ లో ఏర్పాటు చేయించడంలో అర్వింద్ సక్సేస్ అయ్యారు. అదే విధంగా కేంద్రం నిధుల ద్వారా ఆర్ఓబిలతో పాటు కేంద్రియ విద్యాసంస్థల స్థాపన నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మేంట్ తరువాతనే మిగితా నియోజకవర్గాలు అని చెప్పాలి. జాతీయ రహదారుల విస్థరణతో పాటు రైల్వే గుడ్ షేడ్ ఏర్పాటు, మోడల్ రైల్వే స్టేషన్ ల నిర్మాణాలు చురుకుగా సాగుతున్నాయి. ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చడంలో ముందున్న ఎంపీ అర్వింద్ ధర్మపురి పదవులను పొందడంలో వెనకబడిపోయారు. పార్టీ జాతీయ స్థాయి నాయకత్వంలో సంబంధాలు కలిగినప్పటికి తెలంగాణ పరిస్థితుల కారణంగా కేంద్రమంత్రి పదవి, బిజేపి స్టేట్ చీప్ పదవులు అందకుండా పోయాయి. ప్రస్తుతం కేంద్రంలో మూడో ధపా ప్రభుత్వంలో కొత్తగా మంత్రి వర్గ విస్థరణలో పదవికోసం అర్వింద్ అప్పుడే కసరత్తులు మొదలుపెట్టినట్టు చెబుతునారు. కేంద్రమంత్రి పదవి కాకపోయిన పార్టీ చీఫ్ పదవి అయిన దక్కుతుందని ఆయన అనుచరులు గట్టిగా నమ్ముతున్నారు. గత రెండు రోజులుగా అర్వింద్ కు పదవి గ్యారంటీ అంటు అడ్వాన్స్ శుభాకాంక్షల పోస్టింగ్ లు అందులో భాగమే అనే టాక్ నడుస్తుంది..

 

Dharmapuri enters the race

 

తెలంగాణలో ఎంపి అర్వింద్ బిసీ సామాజిక పరంగా బలమైన నేతగా ఉండగా అతనికి పోటీగా మరో ఎంపీ ఈటల రాజేంధర్ కూడా రేసులో ఉన్నాడని చర్చ జరగుతుంది. కేంద్రమంత్రివర్గ విస్థరణలో రాష్ట్రంలో ఎవ్వరికి ఉద్వాసన పలికిన బిసికే కేంద్రమంత్రి పదవి గ్యారంటి అనే చర్చ జరుగుతుంది. అందులో ఎంపీలు డాక్టర్ కే.లక్ష్మణ్, అర్వింద్ ధర్మపురి, ఈటల రాజేంధర్ లు ఉన్నారు. కొందరు తెలంగాణ నేతలు తమకు గవర్నర్ గిరిల కోసం అదిష్టానం వద్ధ ధరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి అనే టాక్ లేకపోలేదు. ప్రస్తుతం కేంద్రమంత్రి వర్గ విస్థరణలో ఎంపిలకే అవకాశం ఉండగా, పార్టీ చీఫ్ ను కుడా మారుస్తారని దానికి యువనాయకత్వంకు అప్పగిస్తారని పార్టీ వర్గాలలో చర్చ జరగుతుంది. బండి సంజయ్ పార్టీ చీఫ్ గా ఉన్నప్పటికి కిషన్ రెడ్డి, రాం చంధర్ రావులు పార్టీ అధినేతలుగా ఉన్న పరిస్థితులను పరిగణలోకి తీసుకుని యువనాయకత్వం పేర్లు తెర మీదకు వచ్చినట్లు తెలిసింది. బలమైన బిసీ సామాజిక వర్గం (కాపు) నుంచి ఎంపీ అర్వింద్ కేంద్రమంత్రి పదవితో పాటు పార్టీ చీఫ్ పదవులలో ఏది ఇచ్చిన స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని ఇదివరకు ప్రకటించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బండి సంజయ్ తరువాత ఒక్క అర్విందే ప్రతిపక్ష లీడర్ పాత్రలను సక్సేస్ గా పోషించారని పేరుంది. బండి సంజయ్ పార్టీ పదవితో పాటు కేంద్రమంత్రి పదవిని నిర్వహిస్తున్న నేపథ్యంలో కొత్తవారి పేరు తెరమీదకు వస్తే అర్వింద్ ధర్మపురి పేరు ముందుగా ఉంటుంది. అందుకే బిజేపి పార్టిలో గాని అర్వింద్ అనుచరుల్లో గాని జోడు పదవులలో ఒకటి అర్వింద్ కు ఖాయమని బల్లగుద్ధి చెబుతున్నారు. తాజాగా బిజేపిలో జరుగుతున్న పరిణామాలు, జాతీయ నాయకత్వం వద్ధకు తెలంగాణ నేతల ఉరుకుల పరుగుల నేపథ్యంలో ఉహగానాలకు తెరపడాలంటే మరికోన్ని రోజులు ఆగాల్సిందే.