
. తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన వారిపై దర్యాప్తు చేపట్టాలి
. వీహెచ్ పీ పిలుపు మేరకు కదం తొక్కిన హిందూ సంఘాలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ధర్మాన్ని అవహేళన, అపవిత్రం చేసిన వారిని భగవంతుడు వదలడని.. ధర్మమే వారిని శిక్షిస్తుందని లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహరాజ్ అన్నారు. హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం తొలగాలని, తిరుమల లడ్డూ వివాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని, ధార్మిక పరిషత్ ఏర్పాటు, ఆలయాల్లో అన్యమతస్తుల తొలగింపు తదితర డిమాండ్ లతో వీహెచ్ పీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని ఎన్టీ ఆర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో గురువులు, పీఠాధిపతులు, బజరంగ్ దళ్, హిందూ వాహిని, ఇస్కాన్, హిందుసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
