యాదగిరిగుట్టలో ధనుర్మాస ఉత్సవాలు
యాదగిరిగుట్ట, బతుకమ్మ: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆలయ అర్చకులు గురువారం తిరుప్పావై పాశురాలు చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.