మోర్తాడ్, బతుకమ్మ: ప్రఖ్యాత తెలుగు బౌద్ధ తత్త్వవేత్త, పండితులు, ప్రత్యక్ష బౌద్ధ గురువు, మోక్షానంద బుద్ద విహార్ వ్యవస్థాపకులు బంతే ధమ్మ రఖ్ఖిత రచించిన “ధమ్మపదం” అనే పుస్తకాన్ని నూతన వధూవరులకు అంబేడ్కరైట్లు బహుకరించారు. గురువారం మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలో కూన అజయ్, పూజల వివాహం జరిగింది. ఈ సందర్బంగా అట్టి పుస్తకం భేటీ ఇచ్చేటప్పుడు డిఎస్ఎస్ నేత అందమైన దంపతులు ఇట్టి పుస్తకం చదవాలని, దానిని ఆచరించాలని కోరారు. తథాగత్ గౌతముడి సూక్తులు, మానవీయ విలువలు, చక్కటి జీవన విధానం, సకల జీవరాసుల వికాసంపై ఆధారపడిన అద్భుతమైన పుస్తకం. నూతన దంపతుల్లో సుఖం శాంతి అభివృద్ధి వర్ధిల్లాలన్న సంకల్పంతో నిండిన పుస్తక భేటీ. ఈ శుభకార్యంలో గ్రామ దళిత విప్లవ పోరాట నాయకులు దివంగత అరె సురేందర్ (కుమార్) తనయుడు అరె అరుణ్, అంబేడ్కర్ యువజన సంఘం మోర్తాడ్ మండలం అధ్యక్షులు అంగుళి మాలజీ, సిరికొండ కార్తీక్, దళిత సంక్షేమ సంఘం (డిఎస్ఎస్) నేత జాంభవ చమార్, కాన్షిరాం మాలజీ, వరుని తల్లీ కూన సత్తాక్క, కరెక్క, మమత మాల, మామిడి రాజశేఖర్, పలిగిరి చరణ్, మూలనివాసి మాలజీ తదితరులు పాల్గొన్నారు.