Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 June 2025, 5:35 pm Posted by : ramakrishna

దేవునిపల్లి పీఎస్ కానిస్టేబుల్ సస్పెండ్

  • ఎస్సై, ఏఎస్సైల సంతకాల ఫోర్జరీ నేపథ్యంలో ఎస్పీ చర్యలు

 

కామారెడ్డి, బతుకమ్మ :   ఎస్సై, ఏఎస్సైల సంతకాలను ఫోర్జరీలకు పాల్పడిన దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న రవికుమార్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఉత్తర్వలు జారీ చేశారు. రవికుమార్ గతంలో కామారెడ్డి జిల్లా పెద్దకొడపగల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించారు. అక్కడ విధులు నిర్వహించే సమయంలో ఆర్టీసీ బస్సు వారెంట్ల కోసం స్టేషన్ ఎస్ హెచ్ వో తో పాటు ఏఎస్సై సంతకాలను ఫోర్జీరి చేసేవాడు. విధులకు గైర్హాజరైనప్పుడు ఉన్నతాధికారులకు నివేదిక పంపించేందుకు ఎస్సై సంతకాలను ఫోర్జరీ చేసి పంపించినట్లు తెలిసింది. ఈ విషయంలో ఎస్సై, ఏఎస్సైల సంతకాలు ఫోర్జరీపై ఫిర్యాదులు రావడంతో డీఎస్పీ ద్వారా విచారణ జరిపించి ప్రస్తుతం దేవునిపల్లి పీఎస్ లో పని చేస్తున్న రవికుమార్ ను సస్పెండ్ చేస్తూ  ఉత్తర్వులు జారీ చేశారు.