Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 July 2026, 9:24 pm Posted by : ramakrishna

ఇందల్వాయిలో ఘటం కుండతో భక్తి ఊరేగింపు

 

. . . గ్రామంలో భక్తిశ్రద్ధల వాతావరణం

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో రేణుకా పుట్ట ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా ఘటం కుండతో భక్తి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా గౌడ సంఘ సభ్యులు మోత్కూరి నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామంలో సంప్రదాయబద్ధంగా ఊరేగింపు చేపట్టారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఘటం కుండతో సాగిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మార్గమధ్యంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ సభ్యులు, మహిళలు, గ్రామ భక్తులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామమంతా భక్తిశ్రద్ధల వాతావరణం నెలకొంది.