బాసర ఆలయానికి పోటెత్తిన భక్తులు
వెబ్ న్యూస్, బతుకమ్మ : నిర్మల్ జిల్లా బాసర లోని జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. దీంతో చిన్నారుల అక్షరాభ్యాసాలు, ప్రత్యేక పూజలు జోరుగా సాగాయి. ఎనిమిదో రోజు మహాగౌరీ అలంకారంలో సరస్వతి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చింది. అలాగే సిద్దిపేట జిల్లా వర్గల్ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. చిన్నారుల అక్షరాభ్యాసాలు, ప్రత్యేక పూజలు జరిగాయి.